భోజనం బాగుంది.. మా ఊళ్లోనూ పెడ్తా.. ఎమ్మెల్యే ఆర్కే
ఇదిగో ఈ ఫొటోలో చేతిలో హెల్మెట్ పట్టుకొని భోజనం చేస్తున్న వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే.. పేరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి.. తన నియోజకవర్గంలో సొంత ఖర్చుతో పేదలకు భోజన వసతి కల్పించాలని అనుకున్నాడు.. అందుకే ఇలా హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న 5 రూపాయల భోజన కేంద్రాన్ని పరిశీలించారు.. క్యూలో నిలుచొని టోకెన్ తీసుకొని వారందించిన భోజనం చేశారు.. అప్పుడే అటుగా వెళ్లిన మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేను చూసి మీరేంటి ఇక్కడ భోజనం చేస్తున్నారని వాకబు చేయడంతో అసలు విషయంచెప్పారు ఆయన.. తన నియోజకవర్గంలోనూ పేద ప్రజల కోసం ఇలాంటి పథకం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు రామకృష్ణారెడ్డి..
No comments