1

Breaking News



ఎవరీ మంత్రిగారి అల్లుడు ?




బెల్లకొండ సాయి శ్రీనివాస్ ప్లాప్ సినిమాల హీరోగా ముద్ర వేసుకున్న హీరో . మొదటి సినిమా అల్లుడు శీను, దాని తర్వాత వచ్చిన స్పీడున్నోడు రెండు నిరాశపరిచిన విషయం తెలిసిందే.అయితే అపజయాల  నిరాశతో కుంగిపోకుండా విజయాలను వెత్తుకుంటూ ముందుకుపోతున్నాడు ఈ యువ హీరో. అందులో భాగంగానే బోయపాటితో దర్శకత్వంలో భారీ చిత్రంతో ప్రజల ముందుకు రాబోతున్నాడు.ఈ మూవీలో శ్రీనుకు జోడిగా రాకుల్, ఇతర ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషలకు చెందిన పలువురు సీనియర్ నటులు కూడా నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాకి కూడా ప్లాన్ చేసాడు. నక్కిన త్రినాద్ రావు దర్శికత్వంలో మూవీ చెయ్యడానికి రెడీ అయ్యాడు. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన త్రినాద్, బెల్లంకొండ సాయి శ్రీనుల కాంబినేషన్ వర్కౌట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం.దిల్ రాజు నిర్మాణ భాగస్వామి గా వ్యవహరిస్తున్న ఈ సిన్మాకి మంత్రిగారి అల్లుడు అనే టైటిల్ కూడా పరిశీలుస్తున్నారు. ఆల్ ద బెస్ట్ అల్లుడు శ్రీను.

No comments