1

Breaking News



మంత్రులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బాబు..




ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి.. ఇటు కేబినెట్‌లోనూ ఇప్పుడు 25 మంది మంత్రులున్నారు.. ఇదే లెక్కతో సీఎం బాబుకో కొత్త ఐడియా వచ్చింది.. వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి ఇంప్లిమెంటేషన్ కూడామొదలుపెట్టారు.. ఇంతకీ ఏంటా ఆలోచన అంటే మంత్రికో పార్లమెంట్ నియోజకవర్గాన్ని అప్పగించారు బాబు.. ఇకపై ఆ నియోజకవర్గ బాగోగులు చూసుకోవడమే కాదు వచ్చే ఎన్నికల్లో ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లను గెలిపించే బాధ్యత కూడా వారికే అప్పగించారు.. దీంతో పదవి వచ్చిన సంబరం పది గంటల్లోనే ఆవిరైందని మంత్రులు భోరుమంటున్నారు.. ప్రస్తుతం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లున్నాయి.. పునర్విభజన జరిగితే మరో రెండు పెరిగే ఛాన్స్ ఉంది.. సో ప్రతీ ఒక్క మంత్రి తాను గెలవడంతోపాటు తన పరిధిలోని తొమ్మిది సీట్లను గెలిపించాలన్నమాట.. పార్టీ పటిష్టంగా ఉంటేనే అధికారంలో ఉంటామనే ప్రాథమిక సూత్రాన్ని ఫాలో అవుతూ అందరూ యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని కూడా హుకూం జారీ చేశారంటా బాబు.. అంతేకాదు ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేలందరినీ మూడు కేటగిరీలుగా విభజించినట్లు వారికి వివరించారంట.. మొదటి కేటగిరిలో గెలిచేవాళ్లు.. రెండో కేటగిరిలో చెబితే విని పొరపాట్లను సరిదిద్దుకునేవాళ్లు.. మూడో కేటగిరిలోచెప్పినా వినిపించుకోని వారిని చేర్చినట్లు తెలుస్తోంది.. మూడో కేటగిరికి వచ్చే ఎన్నికల్లో నిర్ధయగా టికెట్లు ఇచ్చేది లేదని కూడా తేల్చేశారంట.. సో మంత్రులకు అటు ప్రభుత్వ పాలనతో పాటు ఇటు పార్టీని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మీదపడింది..

No comments