1

Breaking News

చేదు నిజం.

పర్యావరణాన్ని చెడగొట్టకూడదు అని నిన్న మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం ఎస్ ఆర్ నగర్ పొలీస్ స్తేషన్ దగ్గర మార్కెట్లో కొందామని ప్రయత్నించి షాక్ తిన్నాను. 8-10 అంగుళాల పొడవైన విగ్రహం ధర 150/- చెప్పారు. పంచరంగులతో చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అడుగు సైజు వినాయకుడి విగ్రహం 100/- చెప్పారు. మా బాబు మట్టి విగ్రహం ఒద్దు నాన్న రంగులతో ఉన్న పెద్ద విగ్రహం 100/-లకే వస్తుంది కదా కొందామనడంతో ఒప్పుకోక తప్పలేదు. గత ఏడాది పెద్ద మట్టి విగ్రహం 30/- కొన్నాను.దానికంటే చిన్నది ఈ ఏడాది 5 రెట్లు ఎక్కువ చెప్పారు. మొత్తానికి ఫేసుబుక్కులో,టివి చానెల్లలో,పత్రికలతో మట్టి విగ్రహాలనే పూజించండి అని చేసిన ప్రచారానికి ఫలితం ఇదన్నమాట. అవకాశం రావాలే కాని జనాన్ని దోచుకోవడానికి వ్యాపారులు-రాచకీయ నాయకులు-పేదవారు అనే బేదం ఏమీ లేదు అని నిన్నటి సంఘటనతో తత్వం బోధపడింది.ఇక వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లో వినాయకుడి మట్టి విగ్రహాలు,పూజా సామాగ్రి,పత్రి అమ్మకాలు జోరందుకుంటాయనడంలో సందేహం లేదు.ఇప్పుడు భక్తి పెద్ద వ్యాపార వస్తువు అయ్యింది అనేది మాత్రం చేదు నిజం.
Vasantam Net

No comments