పెట్టుబడుల ప్రవాహం
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. హోటళ్లు - వాటర్ స్పోర్ట్స్ - రిసార్ట్స్ - సీ స్కైపర్స్ - సీ ప్లేన్స్ - అడ్వెంచర్ స్పోర్స్ట్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా విజయవాడ - మంగళగిరి - గుంటూరు కోర్ ఏరియాల్లో పలు స్టార్ హోటళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రంగంలో అగ్రగాములుగా ఉన్న ఒబెరాయ్ - ఐటీస్ - గేట్ వే - తాజ్ - లీలా తదితర గ్రూపులు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. వీటిలో కొన్ని నవ్యాంధ్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి.
చీరాలలో రూ.40 కోట్లతో బీచ్ రిసార్ట్స్ - బాపట్లలో రూ.40 కోట్లతో గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ రాబోతున్నాయి. విజయవాడలో ఇప్పటికే వరుణ్ గ్రూపు సంస్థ ఆరోగ్య విశ్వ విద్యాలయం సమీపంలో రూ.150 కోట్ల తో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టింది. అమరావతిలో జీవీ ఎస్టేట్స్ రూ.200 కోట్లతో పెద్ద స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టనుంది. ఎం అండ్ ఎం రూ.40 కోట్లతో ఐటీసీ గుంటూరు జిల్లాలో రూ.150 కోట్లతో స్టార్ హోటళ్లు నిర్మించనున్నాయి.
విజయవాడకు రివర్ క్రూయిజ్ - స్కై చోపర్స్ - సీ ప్లేన్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయి. చాంపియన్ క్లబ్ విజయవాడలో రూ.113 కోట్లతో సీ క్రూయిజ్ లను ఏర్పాటు చేయనుంది. స్కై చోపర్స్ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడులతో సీ ప్లేన్స్ ను పరిచయం చేయనుంది. నేల మీద నీటి మీద నడిచే యాంఫీ బియాన్ విమానాలను రూ.13 కోట్లతో ఏర్పాటు చేయడానికి ఫ్రీక్ అవుట్ అడ్వెంచర్ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రం లో రూ.250 కోట్లతో ఎమ్యూజ్ మెంట్ పార్కుల ఏర్పాటుకు వండర్ లా సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టింది. క్యాబ్ సర్వీసులతోపాటు సమస్త సేవలూ ఇప్పుడు అమరావతితోపాటు విజయవాడ - గుంటూరుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.
No comments