సెంటరేదైనా.. దొంగలు స్పాట్ పెట్టేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు పేట్రేగి పోతున్నారు..ఇప్పటికే
స్నాచింగ్ లతో సామాన్యులను భయంభ్రాంతులకు గురిచేస్తున్న దుండగులు...నగలు
నగదు కోసం హత్యలకు వెనకాడటం లేదు..ఉంగరాల కోసం వేళ్లను.నగల కోసం చెవులను
కోసేస్తున్నారు.అవకాశం దొరికినప్పుడల్లా పంజా విసురుతున్నారు
అదిలాబాద్ .. సైబరాబాద్ .. హైదరాబాద్ సెంటరేదైనా.. దొంగలు
స్పాట్ పెట్టేస్తున్నారు. దోచుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు.
అడ్డొస్తే హతమారుస్తున్నారు.ఉంగరాల కోసం చేతివేళ్లను..చెవికమ్మలకోసం
చెవులను కోసేస్తున్నారు.సైబరాబాద్ కమీషనరేట్ లోని శివారు ప్రాంతాల్లో
చైన్ స్నాచింగ్ లతో హడలెత్తిస్తున్న దుండగులు..హైదరాబాద్ లో నగల కోసం
హత్యలకు వెనకాడటం లేదు.తాజాగా మంగళవారం నగల కోసం వృద్దురాలిని హత్య చేసిన
ఘటన అంబర్ పేట్ ఎంసీహెచ్ కాలనీలో కలకలం రేపింది.అంబర్ పేట్ ఎంసీహెచ్
కాలనీలో ఉండే ఆరవై సంవత్సరాల వయస్సు గల సుగుణ ఇంట్లో ఒంటరిగా ఉంది...ఇదే
అదనుగా భావించిన దుండగులు మెడలో ఉన్న బంగారం తో పాటు సుమారు పది తులాల
నగలు..యాబై వేలకు పైగా డబ్బును అపహరించి పరారవ్వగా సుగుణమ్మ అక్కడికక్కడే
మరణించింది...విదులు ముగించుకుని ఇంటికి వచ్చిన కూతురు తల్లి జీవచ్చవంలా
పడిఉండటాన్ని చూసి షాక్ గురైంది..అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాలుగు గంటల ప్రాంతంలో ఏటీఎంలో నగదు డ్రాచేసుకొచ్చింది
సుగుణమ్మ,..అయితే బ్యాంకు వద్ద గమనించిన దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా
అన్న దానిపై పోలీసులు దృష్టిసారించారు.
ఇక పెరిగిపోతున్న దోపిడీ దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా
మారాయి..శివారు ప్రాంతాల ప్రజలైతే చీకటి పడిందంటే చాలు...ఒంటరిగా బయటకు
వెళ్లేందుకే జంకుతున్నారు..అంబర్ పేట్ దోపిడికేసులో హత్య జరిగిన ప్రాంతం
పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉండటంతో దొంగలు ఎంతబరితెగించారో
అర్దమవుతోంది.

No comments