తాతానందం
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తాతానందం పొందుతున్నారు.. కొడుకు గౌతమ్‌కు హనుమాన్ జయంతి రోజున పండంటి మగబిడ్డ జన్మించాడు.. ‘‘పండగ రోజు మా ఇంట్లో మరింత ఆనందం వెల్లివిరిసింది. నా మనవడి రాకతో మా ఇల్లు సంతోషవనమైంది’’ అంటూ బ్రహ్మానందం తన ఆనందాన్ని పంచుకొన్నారు. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రంతో కథానాయకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన గౌతమ్ ఆ తర్వాత ‘బసంతి’తో ఆకట్టుకొన్నారు.. ఇప్పుడు ‘మను’ అనే చిత్రంలో నటిస్తున్నారు. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర దర్శకుడు.
No comments