1

Breaking News



వైసీపీ భేష్.. టీడీపీ షేమ్.. పవన్ ట్వీట్స్..




ఏపీ ప్రత్యేక హోదాపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. టీడీపీ ఎంపీలు తమ సొంత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని అన్నారు. విభజన సమయంలో ఉత్తరాది ఎంపీలు దాడి చేసిన విషయాన్ని కూడా టీడీపీ ఎంపీలు మరిచిపోయినట్లు ఉన్నారని పవన్ ట్వీట్ చేశారు.. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు పలికిన తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలు ఆనంద భాస్కర్‌లకు పవన్ కృతజ్ఞలు తెలిపారు. అలాగే తొలిసారి పవన్ వైసీపీ ఎంపీలను అభినందించారు. వైసీపీ ఎంపీలు హోదాకోసం కేంద్రంతో పోరాడుతున్న తీరు అభినందనీయమంటూ ఆయన ప్రశంసించారు.  ప్రత్యేక హోదా ఇస్తారనే కారణంతోనే ప్రజలు టీడీపీ, బీజేపీలకు అధికారం ఇచ్చారన్న పవన్… హోదాపై రాజీపడే హక్కు టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని అన్నారు. పార్లమెంట్‌లో హోదా అంశం చర్చకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మౌనంగా కూర్చోవడం, టీడీపీ ఎంపీలు సభకే రాకపోవడం వంటి దృశ్యాలు తీవ్రంగా బాధించాయని ట్వీట్ చేశారు పవన్.. యూపీని విభజించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, మరి బీజేపీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను విభజిస్తుందా? లేదా విభజించే రూల్ దక్షిణాది రాష్ట్రమైన ఏపీకే పరిమితం చేస్తుందా? అని కూడా ప్రశ్నించారు పవన్.. ఒక్కో రాష్ట్రంపై ఒక్కో విధానం అనుసరించడం వివక్షే అన్న పవన్.. ఇలాంటివే జాతిని గీతలు గీసి విడదీస్తాయని అన్నారు.

No comments