కేసిఆర్.. ఏదైనా సంచలనమే
తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. వచ్చే అర్దిక సంవత్సరం నుంచి రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణి చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా మే 30 లోపు ప్రతి గ్రామంలో రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంఘంలోని రైతులకు మే 30లోపు ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతుల ఎకౌంటులో క్రెడిట్ చేస్తామని అయన ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణ మాఫీల హామీని నెరవేర్చిన సిఏం, తాజా నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి భవన్ లో గురువారం రైతులతో సమావేశమయ్యారు కేసిఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, లక్ష లోపు రుణాలను పూర్తిగా మాఫీ చేసినందుకు గాను రైతులు కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ … దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సుమారు 17 వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలను మాఫీ చెయ్యడానికి వెచ్చించామని అన్నారు. అదేవిధంగా ఇక తెలంగాణాలో విద్యుత్ కోతలు ఉండవని తెలిపారు. వచ్చే మూడు, నాలుగేళ్ళలో కోటి ఎకరాలకు గోదావరి నీరు అందిస్తామని అలాగే శ్రీరాంసాగర్ కు మేడిగడ్డ నుంచి నీళ్ళు మల్లిస్తామని చెప్పారాయన.
No comments