నోకియా నుంచి మరో కొత్త మొబైల్…వివరాలు ఇవే…
స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి ఇటీవల ప్రవేశించిన నోకియా మరో కొత్త మొబైల్‌ను రంగంలోకి దింపబోతోంది. గత నెల జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో నోకియా 6, 3, 5 అంటూ కొన్ని మోడళ్లను ప్రదర్శించింది. త్వరలో నోకియా 8 విడుదల కాబోతోంది. ఇప్పుడు దాని తర్వాత హై ఎండ్ వెర్షన్ నోకియా 9 తీసుకురాబోతుంది ఆ సంస్థ.. ఐరిస్ స్కానర్, నోకియా ఓజో ఆడియో ఎన్‌హేన్స్‌మెంట్ స్పెషల్ ఫీచర్స్ కాగా 5.5 అంగుళాల తాకే తెర, క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రోసెసర్, 6 జీబీ ర్యామ్, వెనుకవైపు 22 ఎంపీ డ్యూయల్ లెన్స్ కెమెరా, ముందువైపు 12 ఎంపీ కెమెరా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 9 ఫీచర్స్‌గా తెలుస్తోంది.. ఇందులో 64 జీబీ, 128 జీబీ అంతర్గత మెమొరీతో రెండు వెర్షన్లను తీసుకురానున్నట్లు కూడా టెక్ టౌన్ టాక్..
No comments