1

Breaking News

పరిటాల సునీత అన్నంత పని చేసిందా !?




మంత్రి పరిటాల సునీత మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ” మహిలే కదా అని ఈజీ గా తీసుకున్నారో అంతే సంగతులు, అధికారులు ఎవరు తోక జాడించిన విడిచిపెట్టే సమస్య లేదు” అని వార్నింగ్ ఇచ్చిన సంగతే తెలిసిందే. అమ్మగారు అంత గట్టిగా చెప్పక అనుచరులు ఉరుకుంటారా ? అమ్మ అలా అనడమే ఆలస్యం అధికారులపై తమ ప్రతాపం చూపించడం మొదలు పెట్టారు అనుచరులు. తాజాగా అనంతపురం జిల్లా కనగానపల్లె లో MPDO ఆఫీస్ లో టైపిస్ట్ గా పని చేస్తున్న మూర్తి పై దౌర్జన్యం చేసారు. MPP భర్త ముకుంద నాయుడు ఏకంగా టైపిస్ట్ని చెప్పుతో కొట్టాడు. అడ్డుకోబోయిన  MPDO జలజాక్షి ని రాయకూడని మాటలన్నాడు.వృద్దాప్య ఫించన్ల జాబితా తయారు చేయకపోవడమే వారు చేసిన తప్పు. ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే.. సారీ చెప్తే సరిపోతుందని సెలవిచ్చారు. దీంతో కంగు తినడం అధికారుల వంతైంది.

అధికార పార్టీకీ ఇది మాములే…!

ఇటేవల కాలంలో అధికార పార్టీ ఆగడాలు ఎక్కువైపోయాయి. ప్రతీ చిన్న విషయానికి అధికారుల పైన విరుచుకుపడుతున్నారు.. అయితే మాటల దాడి లేకుంటే మరింత రెచ్చిపోయి భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇది కేవలం కార్యకర్తలకు, అనుచరాలకే పరిమితం కాలేదు. మంత్రులు, ఎంపీల స్థాయిలోనూ ఇదే దౌర్జన్యం కనిపిస్తుంది. మొన్నటికి మొన్న MP కేసినేని నాని RTO  అధికారి పై చేసిన దౌర్జన్యంమే అందుకు నిదర్శనం. ఆతరువాత అదే స్పీడ్ను కొనసాగిస్తూ మంత్రి సునీత అధికారులకు వార్నింగ్ ఇవ్వడం, ఆమె అనుచరులు రెచ్చిపోవడం వరసగా జరిగింది. అధికార పార్టీ నేతల తీరుపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన టీం దుకుడుకి కళ్ళెం వెయ్యకపోతే ప్రజలే బుద్ది చెప్పుతారని హెచ్చరిస్తున్నారు.

No comments