అభిమానుల కోరిక తీర్చేందుకు సమయం కోసం చూస్తున్నా...
అభిమానుల కోరిక తీర్చేందుకు సమయం కోసం చూస్తున్నా... మంచి కథ దొరికితే 150వ సినిమాలో నటించి సత్తా చాటుతా... ఇదీ మెగాస్టార్ చిరంజీవి మనసులోని మాట. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కలర్స్ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన విచ్చేశారు. చిరంజీవిని చూసేందుకు విద్యార్థులు, అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఇంత మంది విద్యార్థులను చూస్తుంటే తన కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు.
ఈలోగా విద్యార్థులు మెగాస్టార్... మెగాస్టార్ అంటుంటే ఇంతమంది అభిమానాన్ని కూడగట్టుకున్న తాను నిజంగా అదృష్టవంతుడినేనని చెప్పారు. 150వ సినిమా ఎప్పుడంటూ విద్యార్థులు బిగ్గరగా అరిచారు. మీ అభిమానాన్ని చూస్తుంటే 150వ సినిమా ఎందుకు చేయకూడదని మనసు కోరుకుంటోందని, మంచి కథ లభిస్తే మీ కోరిక తీరుస్తా, చిరు సత్తా చాటుతానంటూ చిద్విలాసంతో చెప్పారు. యువజనోత్సవాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, విషయ సంగ్రహణ, సమష్టి కార్యసాధన వంటి లక్షణాలను అలవర్చుకోవచ్చన్నారు. యువజనోత్సవాల వలన విద్యార్థుల్లో దాగివున్న బిడియం, భేషజాలను పోగొట్టుకోవచ్చన్నారు.

No comments