అధికారి రాజ భోగం
‘రాజు’గారి కోటలో సూపర్ ఛైర్మన్
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా... అన్న చందంగా తితిదే ఛైర్మన్ కార్యాలయ తితిదే అధికారి ఛైర్మన్‌తో పోటీ పడుతున్నారు. వివాదాల్లో తితిదే అధికారి ఛైర్మన్‌కంటే మించిపోయాడు. ఛైర్మన్ బాపిరాజు తన వారికి టిక్కెట్లు కేటాయించుకుంటే. తానేం తక్కువ తిన్నానంటూ ఛైర్మన్ కార్యాలయంలో పని చేసే ఆ అధికారి దళారీలకు దండుగా నిలు స్తున్నాడు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా... అన్న చందంగా తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఛైర్మన్ రాజుగారి కోటలో పనిచేసే అధికారి వ్యవహార శైలి అద్ధం పడు తోంది.దీంతో వారి సంస్థానంలో పనిచేసే అధికారి రాజ భోగం అనుభవిస్తూ, సూపర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తు న్నాడు. తితిదే ఛైర్మన్ కార్యాలయానికి విచ్చేసే భక్తులకు సేవలను అందించడం విస్మరించి, బ్రేక్ దర్శనం టిక్కెట్లకు నిలయంగా మారింది. అడ్డగోలుగా బ్రేక్ దర్శనం టిక్కెట్ల ను ఆ సూపర్ ఛైర్మన్ జారీ చేస్తున్నారని ఆరోపణలు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్న ఆ సూపర్ ఛైర్మన్ వ్యవహారశైలి తితిదేలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి మింగుడు పడటం లేదు. తితిదే ఛైర్మన్ బాపిరాజు స్వామి వారి దర్శనం ప్రముఖులకు చేయించి పేరు ఘడిస్తున్నారు. 45 మంది ఛైర్మన్‌లు తితిదేలో పనిచేసినా వారి కార్యాల యంలో పనిచేసే అధికారులెవ్వరూ ఇష్టారాజ్యంగా వ్యవ హరించలేదు.
ప్రస్తుతం ఉన్న అధికారి మాత్రం తమకు కావల్సిన వారికి ఇబ్బడిముబ్బడిగా టిక్కెట్లను కేటాయిస్తూ, ఆయన వ్యాపారం మూడు సుప్రభాతాలు, ఆరు అర్చనలు, పదుల సంఖ్యలో బ్రేక్ దర్శనాలుగా వెలిగిపోతున్నట్లు విమ ర్శలు గుప్పుముంటున్నాయి. ఛైర్మన్ కార్యాలయంలో వారు ఎవరైనా ప్రశ్నిస్తే ఛైర్మన్ పేరు చెబుతున్నట్లు సమా చారం. ఆ సూపర్ ఛైర్మన్ ఆదాయం కోట్లకు పడగలెత్తి నట్లు భోగట్ట. ఏడాదిన్నర కాలంలో సుమారు కోటి రూపా యల మేర అక్రమార్జన సంపాదించినట్లు సమాచారం. అక్రమ సంపాదనతో ఓ భవన నిర్మాణం చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవలి కాలంలో ఆ అధికారికి ఓ బుల్లికారును బహుకరించినట్టు భోగట్టా. దీపం ఉన్న ప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న...
నానుడిని ఆ సూపర్ ఛైర్మన్ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడనడంలో సందేహం లేదనే విమర్శలు తితిదేలో వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో అన్న చందంగా ఛైర్మన్ కార్యాలయంలోకి విచ్చేసే అనధికారిక భక్తులకు ఆ అధికారి టిక్కెట్లను జారీ చేస్తు న్నట్లు ఆరోపణలు. తమ వారు వస్తే అర్ధరాత్రి, అపరాత్రి అన్న తారతమ్యం లేకుండా టిక్కెట్లు పుట్టుకొస్తాయి. అదే ఓ భక్తుడు ఛైర్మన్ సిఫార్సు లేఖతో ఆయన కార్యాలయానికే వస్తే సవాలక్ష ప్రశ్నలు వేసి, బ్రేక్ దర్శనానికి సమయం అయిపోయింది.. అని చీదరించుకుంటూ, రేపు రా? ప్రత్యే క ప్రవేశదర్శనం టిక్కెట్లు ఇస్తామంటూ ఆ అధికారి నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నాడు. తితిదే ఛైర్మన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని సాక్షాత్ శ్రీనివాసుడే అరికట్టాలని పలువురు భక్తులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.
No comments