త్రైమాసానికి నికరలాభం రూ. 2,369 కోట్లకు పెరిగింది.
పెరిగిన మార్కెట్ క్యాప్ రూ.29,268 కోట్లు
శుక్రవారంతో ముగిసిన స్టాక్ మార్కెట్లో మార్కెట్ క్యాపిటలయిజేషన్ విషయానికి వస్తే అత్యధికంగా ఇన్ఫోసిస్ లాభపడింది. శుక్ర వారం నాడు ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్ అంచనా లను మించిపోయింది. దీంతో బీఎస్‌ఈలో నాలుగు బ్లూచిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలయిజేషన్ రూ. 29,268 కోట్లకు పెరిగింది. కాగా టీసీఎస్, ఒఎన్‌జీసీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ పెరగగా.. మిగిలిన కంపెనీలు రిల్, సీఐఎల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌టీపీసీ లు తమ మార్కెట్ క్యాప్ కోల్పోయాయి.ఈ కంపెనీల మార్కెట్ కలుపుకుంటే రూ.24,546 కోట్లు క్షీణించింది. గత వారంతో పోల్చుకుంటే. ఇక వివరాల్లోకి వెళితే ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ. 20,290 కోట్లు పెరిగితే రూ.1,55,767 కోట్లకు ఎగబాకింది. దీని షేరు ఏకంగా 17 శాతం పెరిగిం ది. మార్కెట్ అంచనాలను మించింది. అక్టోబర్ - డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి నికరలాభం రూ. 2,369 కోట్లకు పెరిగింది. అంతకంటే ముం దు ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే నికర లాభం స్వల్పంగా తగ్గింది.గత ఏడాది రూ. 2,372 కోట్లు నికరలాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీల అమ్మకాల గైడెన్‌స 7.45 బిలియన్ డాలర్లకు సదరిం చింది. వీటిలో ఇటీవలే కొనుగోలు చేసిన స్విస్‌కంపెనీ లోడ్‌స్టోన్ నుంచి 104 మిలి యన్ డాలర్ల రెవెన్యూను కూడా కలిపింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇన్ఫోసిస్ రెవె న్యూ 6.5 శాతం పెరుగుతుంది.
క్యూ3లో ఇన్ఫీ మార్కెట్ అంచనాలను దాటిపోయిం ది. మార్కెట్ విశ్లేషకులు కూడా ఇన్ఫోసిస్ స్వల్ప కాలం నుంచి దీర్ఘకాలానికి మంచి వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన కంపెనీల విషయానికి వస్తే ఒఎన్‌జీసీ రూ.6,203 కోట్లు పెరిగి రూ.2,49,820 కోట్లకు చేరగా, టీసీ ఎస్ మార్కెట్ క్యాప్ రూ.1,732 కోట్లు పెరిగి రూ. 2,55,681 కోట్లకు ఎగబాకింది. కాగా ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ.413 కోట్లు పెరిగి రూ. 1,67,154 కోట్లు పెరిగింది. ఇక మార్కెట్ క్యాపిట ల్ కోల్పోయిన కంపెనీల విషయానికి వస్తే రిల్ రూ. 6,957 కోట్లు కోల్పోయి రూ.2,71,541 కోట్లకు చేరింది. ఐటీసీ రూ.6,808 కోట్లు క్షీణించి రూ. 2,15,470 కోట్లకు, ఎన్‌టీపీసీ రూ.5,071 కోట్లు తగ్గి రూ.1,25,702 కోట్లకు పరిమితం అయింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన మార్కెట్‌క్యాప్ ను రూ. 2,330 కోట్లు కోల్పోయి రూ.1,58,320 ఓట్లకు ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,927 కోట్లు క్షీణించి రూ. 1,34,397 కోట్లు, సీఐఎల్ మార్కెట్ క్యాప్ రూ. 1,453 కోట్లు క్షీణించి రూ.2,27,736 కోట్లకు పరిమితం అయింది. ఇదిలా ఉండగా బీఎస్‌ఈలో టాప్ కంపెనీలు ఈ విధంగా ఉన్నాయి. రిల్ యధా విధిగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
తర్వాత స్థానం వరుసగా ఇలా ఉన్నాయి. టీసీఎస్, ఒఎన్‌జీసీ, సీఐఎల్, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐస బ్యాంకు, ఎన్‌టీపీసీలు ఆక్రమించాయి.
No comments