interview with venkatesh (venky) tollywood
ఇద్దరు స్టార్ ఇమేజ్ హీరోలతో భారీ తారాగణంతో దిల్ రాజు సంక్రాంతి
కానుకగా తెలుగు ప్రేక్షకులకు అందించిన సకుటుంబ సపరివార చిత్రం ‘సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అన్ని వర్గాల వారికీ మెప్పిస్తూ అశేష
ప్రేక్షకాదరణ పొందిన సందర్భంగా హీరో వెంకటేష్ చిత్ర విశేషాలను
పాత్రికేయులకు వివరించారు. 2013 సంవత్సరానికి మంచి బిగినింగ్ వచ్చింది ఈ
చిత్రంతో. ఎంతోకాలంగా సినిమాలు చూడనివాళ్లు సైతం ఈ చిత్రం చూసి
ఆనందిస్తున్నారు. విడుదలైనప్పటినుంచి అన్ని చోట్లా పెద్దోడుగా బాగా
చేశావంటూ అభినందనల వెల్లువ కురిపిస్తున్నారంతా. గతంలో నేను చాలా ఫ్యామిలీ
ఓరియెంటెడ్ పాత్రలు చేసినా ఎందుకో ఈ చిత్రంలోని నా క్యారెక్టర్‌తో సహా
మిగిలిన అన్ని క్యారెక్టర్స్‌లో ఎంతో ఫ్రెష్‌నెస్ కనిపించింది.హీరో
కృష్ణగారు అభినందిస్తూ నిజంగా సొంత అన్నదమ్ముల్ని చూసినట్లుందన్నారు.
ఇగోలు ఎక్కడా పెట్టుకోలేదు ఇద్దరం. సినిమా మొదలయిన పది నిమిషాల తర్వాత ప్రేక్షకులు వెంకటేష్, మహేష్‌ను మర్చిపోయి పెద్దోడు, చిన్నోడుగానే చూస్తున్నారు. మహేష్ కూడా ఎప్పుడు సెట్‌కి వస్తాడా అని ఎదరుచూసేవాడిని. ఇద్దరం చాలా ఎంజాయ్ చేస్తూ సీన్లు చేశాం. నాకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేయాలని చూస్తాను. ఇలాంటి చిత్రాలకు తప్పకుండా మా చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక ఈ చిత్రంలో చాలా సీన్లు నాకు బాగా నచ్చాయి. మొదటిసారి అంజలిని సీత అని పిలిచినప్పుడు...తమ్ముడు మహేష్‌తో ఎందుకురా పూలకుండీని తన్నావు అని ప్రశ్నించినప్పుడు...హాస్పటల్‌లో కోట శ్రీనివాసరావు రియలైజ్ అయిన సన్నివేశం...క్లైమాక్స్‌లో ప్రకాష్‌రాజ్ రాములవారి పల్లకిని మోసే సన్నివేశం ఇలా ఒకటేమిటి చాలా సన్నివేశాలు హృదయాన్ని కదిలించాయి. షూటింగ్ స్పాట్‌లో కూడా చాలా మంది మమ్మల్నిద్దరినీ చూసి రియల్ బ్రదర్స్‌లాగ ఉన్నావని ప్రశంసించారు.
మా ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగానే పండాయి. కొన్ని సన్నివేశాలలో నా క్యారెక్టర్‌లో నా నిజజీవితంలో అన్నయ్య సురేష్‌బాబు గుర్తొచ్చారు. ఆయన కూడా ఎక్కువగా ముఖాభావంగా ఉంటారే తప్ప మనసులో ఏమీ ఉంచుకోరు. ఇలాంటి క్యారెక్టర్లు మన ఇళ్లల్లో చాలా సహజంగా కనిపిస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మా అన్నయ్య క్యారెక్టరే నేను వేశాననిపించింది. ఇద్దరం ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉంటాం...మార్నింగ్ విష్ చేసుకున్నాక మళ్లీ నాలుగయిదు గంటలు మాట్లాడుకోము. సినిమా చూసి మా కుటుంబ సభ్యులు ‘డాడీ ఏడుపు సన్నివేశాలలో అంత బాగా ఎలా చేయగలిగావు’ అని అడిగారు. ఇక ఈ చిత్ర దర్శకుడు కామ్ గోయింగ్. పనిలో మాత్రం తనకు కావలసినది రాబట్టుకునేదాకా వదలడు. సీనియర్ దర్శకునిలా సన్నివేశాలను చిత్రీకరించాడు’ అన్నారు.

No comments