1

Breaking News

ప్రభాస్‌ హావభావాలు అందరికీ నచ్చుతాయి’

ఎంతటి వారితోనైనా హాహాకారాలు పెట్టించే సత్తా ‘మిర్చి’ది. పరిధి దాటి ప్రవర్తిస్తే... మిర్చి దెబ్బను మర్చిపోవడం కష్టం. ఈ ఘాటైన లక్షణాలే ఓ మనిషిలో ఉంటే? ఈ ప్రశ్నకు సమాధానమే యు.వి.క్రియేషన్స్‌ ‘మిర్చి’లో ప్రభాస్‌ పాత్ర’ అంటున్నారు దర్శకుడు కొరటాల శివ. రచయిత నుంచి దర్శకుడుగా మారిన కొరటాల శివ చిత్రం ‘మిర్చి’. ఈ చిత్రం విడుదల గురించి మీడియాతో దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్స్‌, పోస్టర్స్‌ చాలా బాగున్నాయంటూ అభినందనలుతెలుపుతున్నా రంతా...నవరసాలు మేళవించిన కథ ఇది. ప్రభాస్‌ హావభావాలు అందరికీ నచ్చుతాయి’ అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...

‘మిర్చి కొరికితే ఎంత ఘాటుగా ఉంటుందో... అలాగే ఉంటుంది కథానాయకుడి పాత్ర. నేటి తరం కుర్రాళ్లలో ఉండే దూకుడుతోపాటు వెన్నలాంటి మనసు కూడా అతని సొంతం. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ వినసొంపైన బాణీలు ఇచ్చారు. ఆడియో సూపర్‌హిట్‌’ అన్నారు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్‌ . వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభాస్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మిర్చి’. సత్యరాజ్‌, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సంపత్‌కుమార్‌, ఆదిత్య మీనన్‌ ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అశోక్‌కుమార్‌, ఛాయాగ్రహణం: మది.

No comments