1

Breaking News

‘జబ్బర్‌వాక్‌’

2న జురాసిక్‌ ద్వీపం
తహ్‌మో పెనికిట్‌, ఫ్రాన్సిస్‌ మైకేల్‌, అలెక్‌ కాసీ, చార్న్‌ఫీల్డ్‌ ప్రధాన పాత్రధారులుగా సత్యా ప్రొడక్షన్స్‌పతాకంపై తెలుగులో అనువదింపబడుతున్న చిత్రం జురాసిక్‌ ద్వీపం అన్ని హంగులు పూర్తిచేసుకుని మార్చి 2న విడుదలకు సిద్ధమవుతోంది. స్టీవెన్‌ ఆర్‌.మోన్‌రో దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత కోరుకొండ వరహాలరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హాలీవుడ్‌లో రూపొందిన ‘జబ్బర్‌వాక్‌’ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వరహాలరావు మాట్లాడుతూ ‘మారుమూల అడవిలో ఆకాశమంత స్థాయిలో వుంటే ‘జబ్బర్‌వాక్‌’ అనే పక్షి మనుషులపై దాడి చేస్తూ ఉండగా, నలుగురు వీరులు దాన్ని ఎలా అంతమొందించారనే కథతో ఈ చిత్రం రూపొందింది’ అని తెలిపారు. యాక్షన్‌ అడ్వెంచర్‌, ఫాంటసీ చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఇంగ్లీషు, హిందీ, తమిళంతోపాటుగా తెలుగులో మార్చి 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. అన్‌చెల్‌ హ్రిస్టోమీ కోవ్‌, స్టిఫెన్‌ జెన్‌రెస్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన:జయపస్రాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:స్టివెన్‌ ఆర్‌.మోన్‌రో, నిర్మాత:కోరుకొండ వరహాలరావు.

No comments