1

Breaking News

రాష్ట్రపతి పాలన

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. అధికార బీజేపీకి జేఎంఎం మద్ధతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది. సీఎం అర్జున్‌ముండా కూడా గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సయిద్‌ అహ్మద్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఇక్కడ రేపోమాపో రాష్ట్రపతి పాలన విధించనున్నారు.

No comments