జై ఆంధ్రనేతలను పోలీసులు అరెస్టు
విజయవాడలో జై ఆంధ్రనేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర విభజనను 
అడ్డుకుంటున్న సమైక్యాంధ్ర నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వారు 
దుర్గగుడిలో పూజలు చేసేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని 
అరెస్టు చేశారు. రాష్ట్రాన్ని విభజించి, ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడను 
రాజధానిగా చేయాలని, అందుకు లక్ష కోట్లు ఇవ్వాలని జైఆంధ్ర జేఏసీ నేతలు 
డిమాండ్ చేశారు. 
 
 

No comments