ఖాకీపై మోజు.. చోరీలంటే క్రేజు..
కానిస్టేబుల్ కావాలని కలలు కన్నాడు.. కన్నింగ్ ఫెలో అవతారమెత్తి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోనే వెహికిల్ లిఫ్టర్ అయ్యాడు.. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గట్ల పవన్ కుమార్ 10వ తరగతి వరకు చదువుకొని ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు.. తండ్రి మరణించాడు.. తల్లీ, ఇద్దరు అన్నలున్నారు.. పెద్ద అన్న జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లగా రెండో అన్న సుదర్శన్ కానిస్టేబుల్‌గా జగిత్యాలలో పనిచేస్తున్నాడు.. జిల్లాల విభజనకు ముందు సుదర్శన్ కరీంనగర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉండేవాడు.. పోలీస్ అన్న కోసం వచ్చివెళ్తుండే పవన్ క్రమంగా అక్కడ ఉండే పోలీసులతో పరిచయాలు పెంచుకున్నాడు.. వాళ్లందరినీ చూసి కానిస్టేబుల్ కావాలని కలలు కన్నాడు.. అంతేకాదు అన్న క్వార్టర్స్‌లోనే ఉంటూ ఓ ప్రైవేట్ శిక్షణ కేంద్రంలో కానిస్టేబుల్ ట్రైనింగ్‌కు జాయిన్ అయ్యాడు.. ఇక్కడే పవన్ లైఫ్ గాడితప్పింది.. జల్సాలకు మరిగిన పవన్ మెల్లగా హెడ్‌క్వార్టర్స్‌లోనే చోరీలకు ప్లాన్ చేసుకున్నాడు.. అక్కడైతే ఎవరికీ అనుమానం రాదనుకున్న పవన్ సీసీ కెమెరాల్లో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెహికిల్స్ లిఫ్ట్ చేయడం మొదలుపెట్టాడు.. ఇలా 2015 నుంచి ఆరు బైక్‌లను సక్సెస్‌ఫుల్‌గా లిఫ్ట్ చేశాడు.. అందులో ఒకటి తను వాడుకుంటూ, ఒకటి ఇంటి దగ్గర ఉన్న తన పెద్దన్న సుదర్శన్‌కు ఇచ్చాడు.. మరో నాలుగింటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు.. హెడ్ క్వార్టర్స్‌లో బైక్ చోరీలను ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెట్టడంతో పవన్ బండారం బైటపడింది.. దీంతో పవన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా మరో బైక్ చోరీసంగతి కూడా చెప్పేశాడు.. మొత్తం ఏడు బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు పవన్‌కు బేడీలు తగిలించారు.. కానిస్టేబుల్ పవన్ కావాలనే కలలు ఆవిరై క్రిమినల్ పవన్‌గా కటకటాల వెనక్కి చేరాడు..
No comments