1

Breaking News



సుకుమార్ డైరెక్షన్‌లో రాంచరణ్




సుకుమార్ డైరెక్షన్‌లో రాంచరణ్

తమ అభిమాన హీరో నెక్స్ట్‌ సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఖుషీ ఖబర్ అందించాడు రాంచరణ్.. ‘ధృవ’ తరవాత లాంగ్ గ్యాప్‌తో ఆయన సినిమా ట్రాక్‌ మీదకు ఎక్కింది.. సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా ఉంటుందని గతంలోనే చెప్పినా ఇన్ని రోజులు ఎలాంటి క్లారిటీ లేదు.. మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 20న సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని యూనిట్ ‌వర్గాలు ప్రకటించాయి.. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రతీ పాత్ర కొత్తగా ఉండేలా దర్శకుడు సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుతెలుస్తోంది.. కాస్ట్యూమ్స్‌ కూడా విభిన్నంగా ఉండబోతున్నాయని టాక్.. అంతేకాదు దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం ఇప్పటికే నాలుగు పాటల్ని కంపోజ్ చేశాడని, జులై నాటికి సినిమా పూర్తి అవుతుందని కూడా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి..
<!-- telangana ad 1 -->
<ins class="adsbygoogle"
     style="display:inline-block;width:300px;height:250px"
     data-ad-client="ca-pub-2203592211338711"
     data-ad-slot="7654703983"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

No comments