1

Breaking News



ట్రంప్‌ గాడు ఉన్నాడు జాగ్రత్త..




ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చి పడిందన్నట్లు డోనాల్డ్ పట్టాభిషేకం భారత్‌లో అమెరికా పెళ్లి కొడుకులకు శాపంగా మారింది.. అంతకు ముందు పిల్లాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడంటే పెద్ద క్రేజ్.. అమ్మాయిల తల్లిదండ్రులకు అక్కడి అబ్బాయితో పెళ్లిసంబంధమంటే భలే మోజు.. మొత్తంగా ఆల్ టైమ్ గిరాకీ ఉండే ఎన్‌ఆర్‌ఐల పెళ్లి బిజినెస్ ఇప్పుడు డోనాల్డ్ దెబ్బకు క్లీన్ బోల్డ్ అయ్యింది.. విద్య – ఉద్యోగాల సెంటుమెంట్‌కు ట్రంప్ రాసిన పవర్‌ఫుల్ అధికార ఆయింట్‌మెంట్ విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తోంది.. తుపాకీ స్వామ్యం నిద్రలేచి వెర్రితలలు వేస్తోంది.. ఇతర దేశీయుల గుండెల్లో అమెరిగన్స్ తూటాలు దిగుతున్నాయి.. ఇది ప్రత్యక్ష్యంగా అక్కడ నెలకొన్న భయోత్పాత వాతావరణమైతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇతర అంశాలపైనా కనిపిస్తోంది.. అందులో మ్యారేజెస్ మిస్ క్యారేజెస్ అవడం ఒకటి.. ట్రంప్ అధికారంలోకి రాకముందు ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఎగిరి గంతేసే ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడా? ఐతే ఆ మ్యాచ్ మాకొద్దు అని తెగేసి చెబుతున్నారు.. అంతేకాదు కుదిరిన సంబంధాలు సైతం క్యాన్సిల్ అవుతున్నాయి.. ట్రంప్ మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారడంతో జాత్యహంకార దాడులు, హత్యలతో అమెరికా అట్టుడుకుతున్న సమయంలో అక్కడికి పిల్లనివ్వడం క్షేమం కాదనే మాట వినిపిస్తోంది.. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సైతం ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.. గతంలో దుబాయ్ సంబంధం అంటే భయపడేవారు, ఇప్పుడు అదే పరిస్థితి అమెరికా విషయంలో కనిపిస్తోందని చెబుతున్నారు వారు.. అమెరికాపై మోజు తగ్గించుకోవాల్సిందేనని వారు కూడా చెబుతున్నారు.. అంతేకాదు అమెరికాలో ఉన్న పిల్లలను తలుచుకుంటూ వాళ్ల తల్లిదండ్రులకు ఇక్కడ కునుకు కరువైంది.. బతికుంటే బలుసాకు తినొచ్చు అమెరికా వద్దు.. మన దేశమే ముద్దు బిడ్డా!! అనే డైలాగులు ఖండాంతరాల్లో హైపిచ్‌లో వినిపిస్తున్నాయి.. మొత్తంగా ఛూస్తే అమెరికా గేట్‌కు ట్రంప్‌గాడు ఉన్నాడు జాగ్రత్త అనే బోర్డు వేలాడుతోంది.. తస్మాత్ జాగ్రత్త..

No comments