ఒట్టేసి చెబుతున్నా పెళ్లిచేసుకోను : విశాల్
అదేంటి ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్ పెళ్లి చేసుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే.. ఆ మాట అన్నది సాక్ష్యాత్తూ విశాలే.. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.. నడిగర్ సంఘం ప్రధానకార్యదర్శిగా ఛాలెంజిగ్ టాస్క్‌లను చేపట్టిన విశాల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంఘం భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు.. భవన శంకుస్థాపన కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది.. ఆ కార్యక్రమానికి రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ వంటి అగ్రతారలు హాజరయ్యారు.. ఆ సందర్భంగా మాట్లాడిన విశాల్.. భవన నిర్మాణంపూర్తయ్యే వరకు పెళ్లి కూడా చేసుకోనని శపథం చేశాడు.. చాలా మంది దీనిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్మాణాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి తీరుతానని ష్టం చేశాడు.. ఆ తర్వాతే తన పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పాడు..అంటే విశాల్ పెళ్లికి మరో ఏడాదిన్నర సమయం ఉన్నట్లే..
No comments