1

Breaking News



   ఆ ఇద్దరు.. ఆ 30 నిమిషాలు.. బాహుబలి2 హైలెట్ ఇదేనన్న రాజమౌళి..



బాహుబలి ది కన్‌క్లూజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.. తాజాగా ఓ కార్యక్రమంలో సినిమా విశేషాలపై మాట్లాడిన దర్శకధీరుడు రాజమౌళి శివగామి, దేవసేన పాత్రలే హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు.. ‘‘అమరేంద్ర బాహుబలి సవతి తల్లి శివగామి. బాహుబలి ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవసేన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా చక్కగా ఉంటాయి.. సినిమాను రక్తికట్టిస్తాయి. శివగామి ఎంత బలమైన పాత్రో దేవసేనది కూడా అంతే. వీరి మధ్య సుమారు 20-30 నిమిషాల పాటు సాగే సన్నివేశాలు సినిమాకు చాలా కీలకం. ప్రేక్షకుడు సినిమాలో లీనమైపోతాడు. ఎంతలా అంటే వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చూస్తూ కొన్నిసార్లు నేను ఎడిట్‌ చెప్పటం మర్చిపోయా. ఈ రెండు పాత్రలూ నా సినిమాలో ఉండటం నా అదృష్టం’’ అన్నారు రాజమౌళి..

No comments