1

Breaking News



తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం – ఉల్లంగిస్తే శిక్ష



భూగర్భ జలాల పరిరక్షణకు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ నడుం బిగించింది.. ఇకపై తమ ఆదేశాలను ధిక్కరించి బోర్లు వేసినా, ఇసుక తవ్వినా శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి 55 గ్రామాల్లో విపరీతంగా భూగర్భ జలాలను తోడేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.. ఇందులో 35 శాతం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉన్నాయి.. దాదాపు 377 గ్రామాల్లో భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో పడిపోయాయని నివేదికలు చెబుతున్నాయి.. వాల్టా చట్టం కింద ఈ గ్రామాలన్నింటిలోనూ ఇకపై గొట్టపు బావుల కోసం డ్రిల్ చేయడం, బావుల తవ్వకం, ఇసుక తవ్వకం వంటి కార్యక్రమాలపై నిషేధం విధించింది సర్కార్.. ప్రజల మంచినీటి అవసరాలకు మాత్రం దీని నుంచి మినహాయింపునిచ్చింది.. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సిద్ధిపేటలో 162 గ్రామాలు, సంగారెడ్డిలో 115, మెదక్‌లో 100, రంగారెడ్డి 85, నిజామాబాద్ 69 గ్రామాల్లో ఈ నిషేధం అమలులోకి వచ్చింది..

No comments