1

Breaking News



మళ్లీ ఆ ఎంపీకి టికెట్ ఇవ్వలేదు..




శివాలెత్తిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు మరో ఊరు వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదు.. ఎయిరిండియా సిబ్బందిపై చేయి చేసుకున్నాడన్న కారణంతో ఆయనను నిషేధిత ప్రయాణీకుల జాబితాలో చేర్చాయి విమానయాన సంస్థలు.. ఎఫ్‌ఐఏ కింద ఆయన పేరును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు.. ఇండిగో, స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, గోఎయిర్‌ సంస్థలు ఎఫ్‌ఐఏలో సభ్యులుగా ఉన్నాయి.. దీంతో ఇప్పటికి మూడుసార్లు ఎయిర్‌ఇండియా ఆయన టికెట్లను రద్దు చేసింది.. తాజాగా స్పైస్ జెట్‌ సైతం ఆయన టికెట్‌ను క్యాన్సిల్ చేసింది.. ఏప్రిల్‌ 3న పూణె నుంచి అహ్మదాబాద్‌ వెళ్లే విమానానికి ఎంపీ గైక్వాడ్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.. నిషేధిత జాబితాలో ఉండటంతో ఆయన టికెట్‌ను రద్దు చేసింది స్పైస్‌జెట్ సంస్థ..

No comments