ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో భారతీయురాలికి తీవ్ర అవమానం..
బెంగళూరుకు చెందిన శృతి బసప్ప, ఐస్‌లాండ్ దేశీయుడైన తన భర్తతో కలిసి మార్చి 29న ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయానికి వెళ్లింది.. బాడీ స్కానింగ్ పూర్తయ్యాక తనిఖీ అధికారులు ఆమెపై అనుమానం వ్యక్తంచేశారు.. బట్టలు విప్పాలని ఆర్డర్ వేశారు.. రెండు వారాల క్రితమే తనకు శస్త్ర చికిత్స జరిగిందని చెప్పిన బసప్ప అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా చూపించింది.. కానీ ఎయిర్‌పోర్టు అధికారులు పట్టించుకోలేదు.. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ బసప్ప తన భర్తను పిలిచింది.. అతడిని చూడటంతోనే అధికారుల వైఖరిలో మార్పు వచ్చింది.. బసప్పను వదిలేశారు.. కారణం అతనో శ్వేతజాతీయుడు కావడమే.. ఫేస్‌బుక్ ద్వారా బసప్ప ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో విమానాశ్రయ వర్గాలు స్పందించాయి.. అలాంటి రూల్స్ ఏవీ లేవని స్పష్టం చేశారు.. జాతి వివక్ష ఘటనలను ఆమోదించబోమన్నారు.. అంతేకాదు జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని కూడా తెలిపారు..
No comments