ఇది మరో విచిత్రం…ఇప్పటి వరకు మగవారిపైనే ఈ చట్టం..
17 ఏళ్ల బాలుడిపై ఓ యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘోరం కేరళ కొట్టాయంలో చోటు చేసుకుంది.. ఈ కేసులో సదరు యువతిని అరెస్ట్ చేయడంతో పాటు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. నిందితురాలిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.. ఐతే, ఈ కేసులో లైంగిక దాడికి గురైన బాలుడు ఎవరు, ఎప్పుడు ఫిర్యాదు చేశాడన్న వివరాలను మాత్రం పోలీసులు బైటకు వెల్లడించలేదు..
ఇప్పటి వరకు మగవారిపైనే ఈ చట్టం
సాధారణంగా చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తారు.. ఇంతవరకు ఎక్కువగా పురుషులే ఈ చట్టం కింద అరెస్టయ్యారు.. మహిళలు అరెస్టయిన సందర్భాలు లేవనే చెప్పొచ్చు.. తొలిసారి, పైగా అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం..
No comments