కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ రామనవమి ఉత్సవ ఏర్పాట్లు
టీటీడీ అధ్వర్యంలో కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ రామనవమి ఉత్సవ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి మహేష్ శర్మను కలిసిన టీటీడీ అధికారులు ఆలయ ప్రాంగణం, కావలిసిన నిర్మాణ పనుల అనుమతులు, తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 10 న నిర్వహించనున్న కల్యాణానికి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు హాజరవుతారని టీటీడీ ఈవో తెలిపారు. భక్తులకు కావలసిన అన్నీసౌకర్యాలు చేస్తున్నామని, అక్షింతలు, ప్రసాదాలు ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని టీటీడీ అధికారులు చెప్పారు.
Post Comment
No comments