1

Breaking News



కెందాల్ జెన్నర్ యాడ్ తొలగించిన పెప్సీ


సామాజిక న్యాయం కోసం జరిగిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమ కాన్సెప్ట్‌తో రూపొందించిన యాడ్‌ను పెప్సీ వెనక్కి తీసుకుంది.. పాపులర్ మోడల్ కెందాల్ జెన్నర్‌తో ఆ యాడ్‌ను రూపొందించింది పెప్సీ సంస్థ.. కొందరు ఆందోళనకారులు ర్యాలీ చేస్తూ వీధి గుండా వెళ్తుండగా కెందాల్‌ జెన్నర్‌ వారిని చూస్తుంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ర్యాలీ మధ్య నుంచి జెన్నర్‌ పెప్సీ టిన్‌తో వెళ్లి పోలీసులకు ఆఫర్‌ చేస్తోంది. సదరు పోలీస్‌ ఆ టిన్‌ను తీసుకొని తాగడంతో ఒక్కసారిగా వారంతా ఆనందం వ్యక్తం చేస్తారు. ‘ధైర్యంగా బతుకు.. ఇప్పటి కోసం బతుకు’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ యాడ్‌ పూర్తవుతుంది.. ఐతే ఇది బ్లాక్ లైవ్ మ్యాటర్ ఉద్యమ కాన్సెప్ట్‌ కావడంతో సోషల్ మీడియా వేదికగా వివాదం రగులుకుంది.. నల్లజాతీయులపై దాడిని నిరసిస్తూ ఆఫ్రికన్ – అమెరికన్ ప్రజలు చేసిన ఉద్యమమే బ్లాక్ లైవ్ మ్యాటర్.. సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటాన్ని యాడ్‌గా రూపొందించడంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగడంతో పెప్సీ యాజమాన్యం స్పందించింది.. తాము ఐకమత్యాన్ని, శాంతిని మాత్రమే చూపించాలనుకున్నామని, ఈ యాడ్ ద్వారా పొరపాటు చేసినందుకు అందరూ క్షమించాలని చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసిన పెప్సీ యాజమాన్యం యాడ్‌ను వెనక్కి తీసుకుంది..

No comments