ఇండియా లో టాప్ నెట్వర్క్ అదే..ట్రాయ్ గణాంకాలు వెల్లడి..
దేశంలో అత్యధిక డౌన్‌లోడ్ స్పీడ్ జియోనే అందిస్తుందని వెల్లడించింది ట్రాయ్.. ఐడియా, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగాన్ని జియో అందిస్తుందని ట్రాయ్ పేర్కొంది.. మొబైల్ బ్రాడ్ బ్యాండ్ వేగంపై ట్రాయ్ వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.. ఫిబ్రవరి నెలలో జియో నెట్ వేగం 17.42 ఎంబీపీఎస్ నుంచి 16.48 ఎంబీపీఎస్‌కు పడిపోయింది.. అయినా పోటీ సంస్థలు ఐడియా సెల్యులార్ 8.33ఎంబీపీఎస్, ఎయిర్‌టెల్ 7.66ఎంబీపీస్‌తో పోలిస్తే రెట్టింపు వేగాన్ని కలిగి ఉంది.. కేవలం ఐదు నిమిషాల్లో ఒక సినిమా డౌన్‌లోడ్ చేసుకోనే వేగాన్ని జియో కలిగి ఉందని ట్రాయ్ పేర్కొంది.
No comments