రింగ్‌లో రింగ్‌తో ప్రపోజల్..
రింగ్‌లో ప్రత్యర్థిపై విక్టరీ సాధించాడు.. ఆ వెంటనే రింగ్‌తో ప్రేయసీ మది గెలుచుకున్నాడు.. అవును వింటానికి సినిమాటిక్‌గా ఉన్నా నిజమే.. ఫేమస్ రిజ్లర్ జాన్‌సెనా, నిక్కీ బెల్లాతమల లవ్ స్టోరీ ఇది.. ఫ్లోరిడా ఓర్లాండాలో డబ్ల్యూడబ్ల్యూఈ 33వ రెస్లేమేనియా నిర్వహించారు.. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్స్ జాన్ సెనా – నిక్కీ బెల్లాతమ తమ ప్రత్యర్థులైన మిజ్-మార్సిలను మట్టి కరిపించారు.. దీంతో జాన్‌సెనా-నిక్కీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.. ఇంతలో జాన్‌సెనా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రింగ్‌లోనే మోకాళ్లపై కూర్చొని నిక్కీబెల్లాకు రింగ్‌తో ప్రపోజ్ చేశాడు.. పెళ్లి చేసుకుంటావా నన్ను అని అడిగేశాడు.. అంతే వూహించని సన్నివేశానికి భావోద్వేగానికి లోనైన నిక్కీ ఆ వెంటనే జాన్‌కు ఓకే చెప్పేసింది..
No comments