1

Breaking News



ఆ ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టేనా?




పవన్‌ హీరోగా జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు తీసి సూపర్ డూపర్ విక్టరీ కొట్టిన త్రివిక్రమ్ మరో సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు.. హారిక హాసిని సంస్థ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.. కీర్తి సురేష్‌, అనుఇమ్మానియేల్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఓ కాఫీషాప్‌లో మొదలైంది.. పవన్‌, అను ఇమ్మానియేల్‌లపై సరదా సన్నివేశాల్ని తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఖుష్బూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.. నెల రోజుల పాటు హైదరాబాద్‌లోనే షూటింగ్‌ జరుగనున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు అక్టోబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు..

No comments