1

Breaking News



మాకు మంత్రి పదవులు కొత్త కాదు..మా తాతలు కూడా మంత్రులే…




మా కుటుంబానికి మంత్రి పదవులు కొత్త కాదని,  మా తాతలు కూడా మంత్రిగా వ్యవహరించారని బొజ్జల తనయుడు కృష్ణ రెడ్డి అన్నారు. సోమవారం అయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తన ఆవేదనను వెళ్ళబుచ్చారు కృష్ణ రెడ్డి . మంత్రి పదవి నుంచి ఒక్క మాట కూడా చెప్పా పెట్టక పోవడం చాల బాధాకరమని , ఆరోగ్యం సరిగా లేదని చెప్పడం సరికాదని అయన అన్నారు. అందరి మంత్రులు కంటే తన తండ్రే మంత్రిగా ఎక్కువ కష్ట పడ్డారని, గత 35 ఏళ్ళుగా పార్టీ కోసమే నిరంతరం శ్రమించారని, అటువంటిది ఒక్కసారిగా డీగ్రేడ్ చెయ్యడం అస్సలు బాగోలేదన్నారు. ఆరోగ్యం సరిగ్గా లేక మంత్రిగా పనికిరన్నప్పుడు ఇక ఎమ్మెల్యేగా ఎందుకని రాజీనామా చేశారన్నారు. ఇదే విషయాన్నీ ఎంపీ సీఎం రమేష్ , మంత్రి గంటా శ్రీనివాసరావు లకు వివరించామన్నారు. తన తండ్రికి మద్దతుగానే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని zdptc సభ్యుల నుంచి ఆలయ కమిటి చైర్మన్ ల వరకు అందరూ రాజీనామా చేశారని చెప్పారు.   అయితే ఇదంతా చాలా ప్రశాంతగా జరిగిందని, కానీ సోషల్ మీడియాలో తన తల్లి వారిపై కోప్పడ్డట్టు గా రాయడం బాధాకరం అన్నారు .ఈ అసత్య ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పురు కృష్ణ రెడ్డి.  మరో రెండు మూడు రోజుల్లో నియోజకవర్గం లోని కార్యకర్తలతో నాన్నగారి సమేవేశం ఉంటుందని, తదుపరి కార్యాచరణ పై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని కృష్ణ రెడ్డి అన్నారు.

No comments