ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఫ్లాప్ కేవలం ఒకే ఒక్క టికెట్ అమ్ముడైంది
అమెరికన్ నటులు షియా లాబోఫ్, కేట్ మారా నటించిన మాన్ డౌన్ అనే సినిమాకు యూకేలో స్పందనే కరవైంది. ఇటీవల ఈ సినిమాను బర్లీనలోని ఒక థియేటర్‌లో మాత్రమే విడుదల చేశారు.. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క టికెట్ అమ్ముడైందట.. అది కూడా కేవలం 7 యూరోలకు. సాధారణంగా యూకేలో సగటు సినిమా టికెట్ ధర 7.21 యూరోలు ఉంటే.. ఈ సినిమాకు మాత్రం 7యూరోలు వెచ్చించి ఒకే ఒక వ్యక్తి టికెట్ కొనుక్కున్నాడట.. దీంతో తొలి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్ కేవలం 7యూరోలుగా రికార్డు నమోదు చేసింది.. అయితే ఎవరు ఈ సినిమా చూశారన్నది మాత్రం స్పష్టత లేదు.. ఐతే యూకే కంటే ముందు ఈ సినిమాను అమెరికాలో విడుదల చేయగా.. అక్కడ కాస్త ఫరవాలేదనిపిస్తూ 4.54లక్షల డాలర్ల కలెక్షన్లు సాధించింది..
No comments