1

Breaking News



గుజరాత్‌కు తొలి మహిళా డీజీపీ




సోహ్రబుద్దీన్‌, ప్రజాపతి కేసుల్లో దర్యాప్తు చేసిన అధికారిణి గీతాజోహ్రీ గుజరాత్ తొలి మహిళా డీజీపీగా నియామకం అయ్యారు..  2004 నాటి ఇష్రత్‌ జహాన్‌ ఎదురు కాల్పుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న డీజీపీ పీపీ పాండే రాజీనామా చేయడంతో తాజా నియామకం చేపట్టారు.. బెయిల్‌పై ఉన్న పాండే గత ఏడాది డీజీపీ పదవిలో నియామకమయ్యారు.. పాండేను తొలగించేలా ఆదేశాలివ్వాల్సిందిగా కోరుతూ మాజీ పోలీసు ఉన్నతాధికారి జూలియో రిబీరో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇన్‌ఛార్జి డీజీపీగా పదవీకాలాన్ని పొడిగించడాన్నీ సవాలు చేశారు.. దీంతో ఆ స్థానంలో 1982 బ్యాచ్‌కు చెందిన గీతాజోహ్రీకి ఆ ఛాన్స్ వచ్చింది.. ఈ సందర్భంగా డీజీపీ గీతాజోహ్రీ మాట్లాడుతూ తొలి మహిళా డీజీపీగా మహిళల సమస్యలు, శాంతిభద్రతలకే తన ప్రాధాన్యమని తెలిపారు..

No comments