1

Breaking News



ఇక వాట్సాప్‌ పే




మేసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలోనే డిజిటల్‌ పే సేవలను ప్రారంభించనుంది.. వాట్సాప్‌కు భారతే అతి పెద్ద మార్కెట్ కావడంతో ఇక్కడి నుంచే డిజిటల్ పే సేవలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.. ప్రపంచం మొత్తం మీద వాట్సాప్‌కు 100 కోట్ల మంది వినియోగదారులుంటే ఇక్కడే 20 కోట్ల మంది ఉన్నారు.. దీంతో డిజిటల్ పే సర్వీస్‌లకు భారత్‌ను ఎంచుకున్న వాట్సాప్ డిజిటల్‌ లావాదేవీల విభాగానికి అధిపతిని నియమించుకునే పనిలో ఉంది.. భారత్‌లో డిజిటల్‌ సేవల వ్యాప్తికి సహకారం అందించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు గత ఫిబ్రవరిలో ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో వాట్సాప్‌ సహవ్యవస్థాపకులు బ్రియన్‌ యాక్టన్‌ సమావేశమైనట్లు కూడా తెలుస్తోంది..

No comments