వీఐపీ కోసం అంబులెన్స్‌ను నిలిపేసిన పోలీసులు..
ఓ పక్క ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి బాధపడుతూ ఆంబులెన్స్‌లో వెళుతుంటే వీఐపీల కోసం పోలీసులు వాహనాన్ని నిలిపేసిన ఘటన దిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం రోడ్డుపై చోటు చేసుకుంది.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారిని స్ట్రెచర్‌పై ఆంబులెన్స్‌లో తీసుకెళుతుండగా వీఐపీలు వస్తున్నారంటూ పోలీసులు ఆ వాహనాన్ని ఆపేశారు.. అక్కడి సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష్యం కావడంతో ఇలా వెలుగులోకి వచ్చింది.. పోస్టు చేసిన కాసేపటికే 3 లక్షలకు పైగా జనం వీడియోను చూశారు.. బిడ్డ ప్రాణం కంటే వీఐపీ మర్యాదలు ఎక్కువయ్యాయా అంటూ సోషల్ మీడియా వేదికగా పోలీసులను తిట్టిపోస్తున్నారు జనం.. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఎం.ఎస్ రాంధవా మీడియాకు వివరణ ఇచ్చారు.. మలేసియా అధ్యక్షుడు వస్తుండడంతో ట్రాఫిక్ నిలిపివేయాల్సి వచ్చిందని దాంతో పోలీసులు ప్రొటోకాల్ పాటించారని, ఆ తరువాత పోలీసులే దగ్గరుండి ఆంబులెన్స్‌కు దారిచ్చి మళ్లించారని తెలిపారు..
No comments