జై లవ కుశ
ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మాణ సారధ్యంలో బాబీ దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి జై లవకుశ టైటిల్ ఖరారైంది.. శ్రీరామనవమి సందర్భంగా లోగోను ఆవిష్కరించింది చిత్ర యూనిట్.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.. ఆ పాత్రల్ని సూచిస్తూ రాముడు, లక్ష్మణుడు, రావణాసురుడి బొమ్మలతో ఓ డిజిటల్ పోస్టర్‌ని రూపొందించింది సినిమా యూనిట్.. హీరోయిన్స్‌గా రాశీఖన్నా, నివేదా థామస్ నటిస్తుండగా, హంసానందిని, నందిత అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోందని, మే ఆఖరి వారంలో గుజరాత్‌కు షూటింగ్ మారనున్నట్లు చెబుతోంది చిత్ర యూనిట్.. అక్కడ మూడు వారాల పాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు.. ఈ యేడాది చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది..
No comments