లెక్కలో తేడా వస్తే తాట తీస్తా …!
యోగి అదిత్యనాద్ ఏమి చేసిన సంచలనమే. అయన తీసుకున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో యూపీ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన మారో నిర్ణయాన్ని ప్రకటించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఉత్తర ప్రదేశ్ లో నేరాలు అరికట్టే విధంగా కీలక చర్యను తీసుకున్నారు యోగి. యాసిడ్ దాడులు జరుగుతున్న నేపధ్యంలో యాసిడ్ అమ్మకాల నిబంధనలను కఠినతరం చేసారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్. యాసిడ్ వ్యాపారులు తమ దగ్గర ఉన్న స్టాక్ వివరాలు ఖచితంగా ప్రతీ 15 రోజులకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కు తెలియపరచాలి. లెక్కల్లో తేడలోస్తే 50 వేల జరిమానా తో పాటు మొత్తం స్టాక్ కూడా సీజ్ చేస్తామని భట్నాగర్ హెచ్చరించారు. అంతేకాకుండా ప్రతీ నెల ఏడో రోజు క్రమం తప్పకుండా జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది ప్రభుత్వం. కొనుగోలు చేసినవారి పేరు, చిరునామా మరియు ఎంత మొత్తంలో యాసిడ్ తీసుకొన్నారో వంటి వివరాలు తప్పనిసరిగా నమోదు చెయ్యాలని పేర్కొన్నారు.
No comments