AP Politics – జగన్ హీరో – బాబు విలన్ .
దొంగే దొంగా..దొంగ అని అరిచినట్లుగా బాబు తీరు ఉందని మండిపడ్డారు దిగ్విజయసింగ్. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా పని చేస్తున్న దిగ్విజయసింగ్ నిన్న పిసిసీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిని అయన అమరావతీ భూసేకరణ పేరుమీద జరుగుతున్న అక్రమాలను ఎండగట్టారు.రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 2013 భూ సేకరణ చట్టం బిల్లు రైతులకు, రైతు కూలీలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందన్నారు అయన. అవసరానికి మించి భూములను సేకరించి తన సొంత బినామీ కంపెనీలకు అక్రమంగా కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు దిగ్విజయసింగ్. ఈ అవినీతి విషయంలో బాబునే పెద్ద ఆర్ధిక నేరస్తుడన్నారు. అసలు బాబుకి జగన్ ని విమర్శించే హక్కే లేదన్నారు. పెర్సెంటేజీల కోసమే బాబు, వెంకయ్యనాయుడు కలిసి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడి ప్రత్యేక ప్యాకేజీకి తలూపరని అన్నారు దిగ్విజయసింగ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ, ఎప్పటికి పార్టీకి ఆదర్శమని… పార్టీ నేతలు, కార్యకర్తలు అయన అడుగు జాడలలోనే నడుస్తారని నొక్కి చెప్పారు అయన.
No comments