1

Breaking News

            మంత్రి పదవులకు అర్హతలేమిటో వివరించి చెప్పిన చంద్రబాబు.



ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే మంత్రివర్గ  విస్తరణ చెయ్యాల్సి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్టీ ప్రయోజనాలు కన్నా రాష్ట్ర అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనిషినని అయన చెప్పారు. పార్టీ మారిన ఎమ్మేల్యేలలో సమర్ధులు ఉన్నారని, అందుకే వారికి మంత్రి పదవులు దక్కాయి అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చెయ్యడం తగదన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల పని తీరుపై మూడు నెలలకు సమీక్ష ఉంటుందని చెప్పారు. దీని పై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, అది కుడా తనకు మంచిదేనని ఆయన అన్నారు.
సరిగ్గా బాబు మాట్లాడిన ఈ మాటలే పచ్చ తమ్ముళ్ళకు ఎక్కడో కాలుతుంది. మంత్రి పదవికి కావలిసిన సమర్ధత మన ఎమ్మేల్యేలకు లేదా ? అనే మీమాంసలో పడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా భుజం తడుముకుంటున్నారు. అసలు మంత్రి పదవికి కావాల్సిన సమర్ధత ఏమిటంటు గూగుల్లో వెతుక్కుంటున్నారు. పార్టీ మారడం కూడా అర్హతేనా అంటూ మండి పడుతున్నారు. బాబు మార్కు రాజకీయం తెలిసిన వారు మాత్రం జాతకంలో రాశుల్ని నిందించుకుంటూ కామ్ గా కూర్చున్నారు.
పైకి మాట్లాడక పోయిన లోకేష్ వ్యవహారం మీద పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. సమర్ధత గురించి మాట్లాడిన బాబు లోకేష్ సమర్ధత ఏపాటిదో కూడా గమనించాలి. ప్రస్తుత అనుభవం ఉన్న ఎమ్మెల్యేల కంటే లోకేష్ ఏపాటి  సమర్థుడో అర్ధం కాకా తలలు పట్టుకుంటున్నారు. బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, ధూళిపాళ, గాలి ముద్దు కృష్ణమ నాయుడు వంటి సీనియర్ నాయకుల కంటే మంత్రి పదవుల లిల్స్ట్లో లోకేష్  పేరే ముందు ఉండడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక రకంగా బాబు నిర్ణయం క్షేత్ర స్థాయి కార్యకర్తలో అసంతృప్తి నే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

No comments