రాజ్ భవన్ వద్ద మీడియాతో శ్రీ వైయస్.జగన్
గవర్నర్ గారిని కలిసి లేఖ అందజేశామని శ్రీ వైయస్.జగన్ తెలిపారు. ఈ లేఖ ద్వారా మేము గవర్నర్ ను అడిగింది ఒక్కటే. సర్.. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడిగామన్నారు. వేరే పార్టీ గుర్తు, టిక్కెట్ మీద గెలిచి.. పదవులు సంపాదించి.. ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యేగా అనర్హతకు గురికాకుండా, మంత్రులుగా పదవీ స్వీకారం చేయటం ప్రజాస్వామ్యంలో ధర్మమేనా అని ప్రశ్నించామని శ్రీ జగన్ తెలిపారు. గతంలో తెలంగాణలో శ్రీనివాస యాదవ్ విషయంలో చంద్రబాబు అన్న మాటల్ని గుర్తు చేశామని శ్రీ జగన్ తెలిపారు. ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేయకుండా, మంత్రులుగా పదవీ స్వీకారం చేయటం అంటే రాజకీయ వ్యభిచారులుగా పోల్చిన ఘటనను గవర్నర్ కు గుర్తు చేశామన్నారు. ఆనాడు చంద్రబాబు మాట్లాడిన మాటలు.. చేస్తున్న చేతలు రెండూ సబబేనా అని గవర్నర్ ను అడిగామని శ్రీ వైయస్.జగన్ తెలిపారు. ఇలా చేయటం ప్రజాస్వామ్యంలో తప్పని గుర్తు చేశామన్నారు.
పార్టీ ఫిరాయించిన వారి రాజీనామాలను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు. గవర్నర్ అనే వ్యక్తి ఇలాంటి తప్పులు జరగకుండా చూడటానికే ఉంటారన్నారు. అలాంటి గవర్నర్ చేతనే ఇలాంటి తప్పులు చేస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుందని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని గవర్నర్ గారికే వదిలివేయమని, ఈ విషయాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ఈసీని కలుస్తామన్నారు. అవసరమైతే ప్రధాని మోడీని కలిసి భాగస్వామి బాబు చేస్తున్న వ్యవహారాన్ని గుర్తు చేస్తామన్నారు. రేపు ఇలాంటి వ్యవహారమే మీదాక వస్తుందని తెలియజేస్తామని.. ఈ అంశంపై ఇతర పార్టీల సహకారం తీసుకుంటామన్నారు. ఈ నలుగురు చేత రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నికలు జరిగేలా చేస్తామన్నారు. దీనిపై ఎలాంటి కార్యక్రమాలో చేయాలో, ఒత్తిడి ఎలా తేవాలో అన్నికార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
No comments