1

Breaking News



త్వరలో జియో ఐపీ టీవీ




మెబైల్ నెట్‌వర్క్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్‌ జియో మరో బంపర్ ఆఫర్‌ను సిద్ధం చేస్తోంది.. త్వరలో ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ టెలివిజన్‌ (ఐపి టీవీ) ప్రసారాలు ప్రారంభించబోతోందని తెలుస్తోంది. దీనిపై కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇటీవల ఆన్‌లైన్‌లో లీకైన సెట్‌టాప్‌ బాక్స్‌ను చూస్తే జియో త్వరలో ఐపిటీవీ సేవల రంగంలోకి ప్రవేశిస్తుందన్న ప్రచారం జోరందుకుంది.. సెట్‌టాప్‌ బాక్సులు ఉచితంగా అందించడంతో పాటు, డిటిహెచ్‌ ఆపరేటర్ల కంటే 40-50 శాతం చౌకగా ఐపిటీవీ ప్రసారాలు అందించడం జీయో లక్ష్యంగా తెలుస్తోంది.. అదే జరిగితే టెలికాం రంగంలో మాదిరిగానే డిటిహెచ్‌ రంగంలోనూ పెద్ద కుదుపు తప్పదు.. అంతేకాదు ఐపిటీవీ సేవలతోపాటు త్వరలోనే కేబుల్‌ టీవీ రంగంలోకీ రిలయన్స్ ప్రవేశించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరందుకుంది..

No comments