నన్నూ పడక గదికి రమ్మన్నారు – నటి పార్వతి సంచలన వ్యాఖ్యలు
మొన్నటికి మొన్న సింగర్ సుచిత్ర సంచలనాలు.. ఆ తరువాత నటి వరలక్ష్మి శరత్‌కుమార్, సంధ్య, కస్తూరి పేల్చిన బాంబులు.. ఇప్పుడు నటి పార్వతి అంతరంగం.. ఇవన్నీ చూస్తుంటే సినీ పరిశ్రమ పెద్ద మురికికూపంగా కనిపిస్తోంది.. ప్రముఖుల రాసలీలను ట్విట్టర్‌లో వెల్లడించి సింగర్ సుచిత్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.. సినీ ఇండస్ట్రీలో ఆ డర్టీ పిక్చర్ నిజమేనని చాలా మందే నోరు విప్పారు.. తాజాగా నటి పార్వతి కూడా ఆ లిస్ట్‌లో చేరారు.. పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ మలయాళీ భామ ధనుష్‌కు జంటగా మరియాన్, ఆర్య, రానా, బాబిసింహాలతో కలిసి బెంగళూర్ డేస్ చిత్రాల్లో నటించింది.. అటు మలయాళంలోనూ బిజీగా ఉన్న పార్వతీ తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.. హీరోయిన్ల పట్ల చిత్ర పరిశ్రమ వైఖరిపై వస్తున్న ఆరోపణలు నిజమేనన్నారు.. పడక గదికి రమ్మనే చేదు అనుభవాన్ని తాను సైతం ఎదుర్కొన్నానని చెప్పారు. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు తనను పలుమార్లు పడక గదికి రమ్మన్నారని, మరి కొందరు సినిమాల్లో ఇదంతా మామూలే అని ఉచిత సలహాలు ఇచ్చారని అన్నారు. అయితే అలాంటి అవకాశాలు తనకు వద్దని ఖరాఖండిగా చెప్పానని తెలిపారు. తాను తక్కువ చిత్రాలు చేయడానికి ఇదీ ఒక కారణం అని నటి పార్వతి పేర్కొన్నారు. అలా అవకాశాలు లేకుండా తాను చాలా కాలం ఖాళీగానే ఇంట్లో కూర్చున్నానని చెప్పారు పార్వతి..
No comments