తిరుమల వేంకటేశ్వర స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు …
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనాల్లో, టీటీడీ పాలక మండలి కొన్ని మార్పులు చేశారు. ఏప్రిల్ 7 నుంచి 10 వారలు పాటు ఈ నిబంధనలు అమలు పరుస్తామని ఆలయ ఈవో డి.సాంబశివరావు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మూడో కేటగిరి ఉండదని, కేవలం మొదటి రెండు కేటగిరీలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాక శుక్ర, శని వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సంబధిత సిఫారసు లేఖలను కూడా రద్దు చేస్తునట్లు అయన పేర్కొన్నారు. రద్దీని బట్టి ప్రత్యేక ప్రవేశ దర్శనంలో కూడా మార్పులు చేస్తామని తెలిపారు. రూ. 4.45 కోట్లతో అప్పలాయగుంట, రాయచోటిలో కళ్యాణ మండపాలు, మరియు రూ. 39 కోట్లతో వకుళమాత అతిధి భవన నిర్మాణానికి వ్యయం చేస్తున్నట్టు అయన మీడియాకు వివరించారు.
No comments