మంత్రుల ఛాంబర్ లో లోకేష్ ఫొటో
నారా లోకేష్. ప్రస్తుతం ఎమ్మెల్సీ. కాబోయే మంత్రి. ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. కాని విచిత్రమేంటంటే… మంత్రి నారాయణ ఛాంబర్ లో నారా లోకేష్ ఫొటో దర్శనమిచ్చింది. మంత్రి నారాయణ ఛాంబర్ లో తొలుత ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలు ఉండేవి. అయితే లోకేష్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నారాయణ తన భక్తిని చాటుకున్నట్లుంది. భవిష్యత్ పార్టీ నేతను బుట్టలో వేసుకునేందుకు ఎన్టీఆర్, చంద్రబాబు చెంత లోకేష్ ఫొటో ను కూడా చేర్చారు. నారాయణ ఛాంబర్ లో దర్శనమిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదేంది నారాయణా అని కామెంట్లు కూడా విన్పిస్తున్నాయి. ప్రభుభక్తి ఉంటే ఉండొచ్చు కాని తన భక్తిని బహిరంగంగా ప్రదర్శించుకోవడంలో నారాయణకు మించిన వారు లేరన్న కామెంట్లు కూడా విన్పిస్తున్నాయి.
No comments