‘ఇండియన్ ఐడల్’గా రేవంత్ – సెకండ్ రన్నరప్‌గా రోహిత్
ఇండియన్ ఐడల్ విజేతగా మరో తెలుగోడు సత్తా చాటాడు.. సీజన్ 9కు జరిగిన పోటీలో ఉత్తారది సింగర్ల నుంచి ఎదురైన పోటీని తట్టుకొని చివరిదాకా నిలిచిన ఎల్వీ రేవంత్‌ను తుది విజేతగా ప్రకటించాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్.. శ్రీకాకుళంకు చెందిన రేవంత్ హైదరాబాద్‌లో గాయకుడిగా స్థిరపడ్డారు.. ఇండియన్ ఐడల్ పోటీలో విశాఖపట్నం నుంచి ప్రాతినిథ్యం వహించాడు.. ఈ పోటీలో పంజాబ్‌కు చెందిన ఖుదా బక్ష్ రెండో స్థానంలో నిలవగా.. మరో తెలుగు కుర్రాడు పీవీఎన్‌ఎస్ రోహిత్ మూడో స్థానం సాధించారు.. విజేతగా నిలిచిన రోహిత్‌కు ఇండియన్ ఐడల్ బిరుదుతో పాటు 25 లక్షల నగదు, మహీంద్రా కేయూవీ 100 వాహనం పారితోషికం రూపంలో లభించనున్నాయి.. సోనీ మ్యూజిక్ సంస్థతో పాటల ఒప్పందాన్ని కూడా గెలుచుకున్నాడు రోహిత్.. ఇదిలా ఉంటే రోహిత్‌కు ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది.. బాహుబలి చిత్రంలో ‘మనోహరి’, దమ్ము సినిమాలో ‘రూలర్’ పాటలతో ఆయన సంగీత ప్రియుల మదిని దోచుకున్నారు..
తెలుగువాడికి రెండోసారి..
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ టైటిల్ తెలుగువారికి దక్కడం ఇది రెండోసారి.. గతంలో శ్రీరామచంద్ర టైటిల్‌ను గెలుచుకున్నారు.. అంతుకు ముందు సింగర్ కారుణ్య రన్నరప్‌గా నిలిచాడు.. ఆ తరువాత ఇప్పుడు టైటిల్‌తో పాటు మరో తెలుగువాడు రన్నరప్‌గా నిలవడం అందరికీ గర్వకారణమే..
అందరికీ కృతజ్ఞతలు
‘‘ఇంటికి వెళ్లి నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విజయంపై సంబరాలు చేసుకుంటా. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్థిరపడతా. మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు’’ అని టైటిల్ గెలిచిన అనంతరం ఉద్వేగంతో చెప్పాడు రేవంత్..
No comments