చోరీలకు పాల్పడుతూ… ఏకంగా 19 ఇళ్లలో సొత్తు అపహరించిన దొంగ
అయిదు నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతూ… ఏకంగా 19 ఇళ్లలో సొత్తు అపహరించిన దొంగను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, రాంగోపాల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. యాఖుత్‌పురాకు చెందిన గఫార్‌ఖాన్ జల్సాలకు అలవడి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 19 ఇళ్లలో సొత్తు కాజేశాడు. గఫార్‌ఖాన్ తీరుపై అనుమానం వచ్చిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ కె.నరేశ్‌గౌడ్ కూపీ లాగడంతో చోరీల విషయం బయటపడింది. అతడిని అరెస్టు చేసి విచారించగా.. చోరీ సొత్తు కొన్న వ్యాపారుల వివరాలు వెల్లడయ్యాయి. ఈమేరకు ఘాన్సీబజార్‌లో నగల వ్యాపారం చేసే తండ్రీకొడుకులను సైతం అరెస్ట్ చేశారు పోలీసులు.. వారి నుంచి 45 లక్షల రూపాయల విలువైన 1.5 కిలోల బంగారు నగలు, రూ.30 వేల నగదు, హోండా యాక్టివా, మూడు సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.. గఫార్‌ఖాన్‌పై పీడీ చట్టం అమలు చేస్తామని అదనపు డీసీపీ తెలిపారు.
No comments