జూ.పవర్‌స్టార్‌గా కాదు.. అకీరానందగానే – రేణూ దేశాయ్..
తన కొడుకుకు సొంత గుర్తింపునే కోరుకుంటుంది రేణూ దేశాయ్.. తను జూనియర్‌పవర్‌స్టార్‌గా కాకుండా అకీరా నందగానే ఐడెంటిటీ తెచ్చుకుంటాడనే నమ్మకం తనకు ఉందని చెబుతోంది.. పవన్, రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరా 13వ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌వేదికగా కుమారుడికి శుభాకాంక్షలు చెప్పిన రేణూ పై విధంగా కామెంట్‌రాశారు.. ‘13.. నా చిట్టికుమారుడు ఆరడుగుల ఎత్తుతో టీనేజ్‌లోకి అడుగుపెట్టడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నా బాబుకు 13 ఏళ్లు అని ఆలోచిస్తుంటే పుట్టే భావోద్వేగంలో నిజంగా నాకు మాటలు కరవయ్యాయి. ఈ ప్రపంచంలో అతను తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, తల్లిదండ్రుల నీడలో కాకుండా తన కాళ్లపై తాను నిలబడాలని ప్రార్థిస్తున్నా. నా కుమారుడికి సొంత గుర్తింపు ఉంటుందని, జూనియర్‌పవర్‌స్టార్‌గా కాకుండా అకీరానందగా పేరు తెచ్చుకుంటాడన్న నమ్మకం ఉంది! నా స్వీట్‌హార్ట్‌అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేసింది రేణూ దేశాయ్..
No comments